Home జాతీయం ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే – J7TV News

ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే – J7TV News

by J7 TV NEWS
0 comments
ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే




పవన్ కళ్యాణ్ హామీ నిలబెట్టుకున్నాడు: గొల్లప్రోలు వంతెన పూర్తి, దశాబ్దాల కష్టాలు తీరిపోయాయి.

గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ నూతన బ్రిడ్జిని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan

• వంతెన నిర్మాణం పనుల పరిశీలన

• ఉప ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెబుతూ ప్లకార్డులు ప్రదర్శించిన కాలనీ వాసులు

పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సదర్శించారు. సుద్దగడ్డ కాలువపై నిర్మించిన వంతెన పనులను పరిశీలించారు. బ్రిడ్జి మొత్తం తిరిగి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సుద్ధగడ్డ కాలువపై శ్రీ పవన్ కళ్యాణ్ గారితో రూ. 3.05 కోట్ల అంచనా వ్యయంతో రోడ్లు భవనాల శాఖ ఈ వంతెన నిర్మించబడింది. 2024 సెప్టెంబర్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో భాగంగా హౌసింగ్ కాలనీ సందర్శనకు వచ్చిన సందర్భంలో వరద ముంపులో ఉంది.

పడవపై వెళ్లి కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలువకు వరద వచ్చిన ప్రతిసారి ముంపునకు గురవుతోందని, రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని హౌసింగ్ కాలనీ వాసులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. వరదలు వచ్చిన ప్రతిసారి జనజీవనం స్తంభించిపోతుందని వాపోయారు. ఆ సందర్భంలో కాలువపై బ్రిడ్జి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఆ మేరకు కార్యాచరణ రూపొందించి హామీ నెరవేర్చారు. శుక్రవారం సంక్రాంతి మహోత్సవ వేదికపై లాంఛనంగా బ్రిడ్జిని ప్రారంభించి శనివారం పరిశీలనకు వచ్చారు. ఈ సందర్భంగా ముంపు కష్టాలు తొలగించిన ఉప ముఖ్యమంత్రి కాలనీ వాసులు, స్కూలు పిల్లలు థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సర్ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికారు.

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్న పిఠాపురం ఎమ్మెల్యే, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

• 2024 వరదల సమయంలో పడవలో వెళ్ళి ముంపు ప్రాంతాన్ని సందర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

• బ్రిడ్జి ఏర్పాటు ప్రజలకు హామీ

• ఏడాది కాలంలోనే దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి

• సుద్ధగడ్డ కాలువపై రూ. 3.05 కోట్ల అంచనా వ్యయంతో వంతెన నిర్మాణం పూర్తి చేసింది R & B శాఖ

• బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో విద్యార్థులకు, మహిళలకు, రైతులకు ఇబ్బందులు.

You may also like

Leave a Comment

J7 TV NEWS delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, J7 Tv NEWS is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird